Sunday, January 19, 2025
HomeTrending Newsచరిత్రలో నిలిచిపోతాయి: సిఎం జగన్

చరిత్రలో నిలిచిపోతాయి: సిఎం జగన్

Nadu-Nedu:  ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు-నేడు చేపట్టిన తమ ప్రభుత్వంతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాడు-నేడు రెండో దశ పనులు శరవేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.  విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు…

⦿ నాడు-నేడు రెండోదశ కింద దాదాపు 25వేల స్కూళ్లలో పనులు

⦿ దీని ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు కనిపించాలి

⦿ ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు–నేడు కింద పనులు చేపట్టాలి

⦿ నాడు-నేడు రెండోదశ ఖర్చు అంచనా రూ. 11,267 కోట్లు

⦿ ఈ విద్యా సంవత్సరంనుంచి 8వ తరగతి బోధన ఇంగ్లిషు మాధ్యమంలో ఉంటుంది

⦿ నాడు–నేడు కింద  468 జూనియర్‌ కళాశాలల్లో పనులు

⦿ ప్రతి మండలానికీ 2 జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలి

⦿ వీటిలో అమ్మాయిలకోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలి, దీనిపై కార్యాచరణ తయారుచేయాలి

⦿ స్కూళ్లు తెరిచే నాటికి జగనన్న విద్యాకానుక అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు

⦿ విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు

⦿ గతేడాదితో పోలిస్తే మరో రూ.200కోట్లకుపైగా అదనపు ఖర్చు

⦿ విద్యాకానుక కోసం ఖర్చు అయినా పర్వాలేదు

⦿ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే

⦿ వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది

నూతన విద్యా విధానం,  సబ్జెక్టుల వారీగా టీచర్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌, విద్యావ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులు, జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై కూడా సిఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : ఇదే మా పాలనకు నిదర్శనం: జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్