Sunday, November 24, 2024
HomeTrending NewsHealth: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ కు ప్రాధాన్యం

Health: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ కు ప్రాధాన్యం

వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని, ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. వీటిలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌లు ఉంచాలని ఆదేశించారు.  వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సిఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు-నేడు కార్యక్రమాల అమలుపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు:

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో క్రమం తప్పకుండా మందులతో పాటు వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై సూచనలు కూడా ఇవ్వాలి

ఈ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి

అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలి

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పర్యవేక్షణకు సమర్థయంత్రాంగం ఉండాలి

రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను నియమించాలి

రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి

ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్‌ క్లినిక్స్‌ సహా అన్నిచోట్లా  ఈ నంబర్‌ను ఉంచాలని సిఎం ఆదేశించారు.

ఆరోగ్యశ్రీద్వారా ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాలి

నెట్వర్క్‌ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ను రూపొందించాలి

సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చూపేలా ఈ యాప్‌ ఉండాలి

ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేసే పరిస్థితి రావాలి

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : ఆరోగ్య శాఖకు సిఎం అభినందన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్