Sunday, November 24, 2024
HomeTrending Newsపెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటా

పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటా

గ్రామ సచివాలయాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. మొత్తాల్ 65.31 లక్షల మంది లబ్ధి దారులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కార్యక్రమం టిడిపికి ఘనవిజయం అందజేసిన మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం  పెనుమాకలోని ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి పాముల నాయక్ కుటుంబానికి తొలి పెన్షన్ ను సిఎం అందించారు.

పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, ఆయన భార్యకు CRDA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. ఆ ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు తన జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుందని, ప్రతి ఇంటికీ పెద్ద కొడుకుగా ఆ కుటుంబ బాధ్యతను తీసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు.

గత ఐదేళ్ళ పాలన ఓ పీడ కల అని, రాష్టాన్ని పట్టి పీడించి ఎన్నో ఇబ్బందులు కలిగించారని,  నలుగురు కలిసి స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేదన్నారు. నిద్ర లేస్తే టెన్షన్  ఉండేదని, పోలీసులు గోడ దూకి వచ్చేవారని… నా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉండేదని బాబు విమర్శించారు. గతంలో సిఎం ఎక్కడకు వెళ్ళినా పరదాలు కట్టేవారని… మురికి కాలువకు కూడా మూసివేసి ఉండేవారని…. పరదా కట్టినంత మాత్రాన మురికి వాసన రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు.  ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని, దాన్ని అధిగమించి మళ్ళీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్