Monday, January 20, 2025
HomeTrending Newsసిఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ: కేశవ్

సిఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ: కేశవ్

రాజకీయ కారణాలతోనే సిఎం జగన్ విశాఖ రాజధానిపై నేడు వ్యాఖ్యలు చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. అమరావతే రాజధాని అంటూ  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు  స్పష్టమైన తీర్పు ఇచ్చిందని  ఆయన గుర్తు చేశారు. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, నేడు విచారణ కూడా జరగాల్సి ఉందని అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేశవ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్