2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాట సంఘాల కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం నమోదుచేసిన కేసుల ఉపసంహరణకు రాష్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావులు క్యాంపు కార్యాలయంలో సిఎం ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు.
అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.