Organic farming: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. రెండ్రోజుల పర్యటన కోసం నేడు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకున్న సిఎం తొలుత నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రకృతి సేద్యంపై పరిశోధనకోసం పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచ స్దాయి ఇండో–జర్మన్ అకాడమీకి, ఏపి– కార్ల్ లో న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేశారు.
ఆహారం రూపంలో మనం తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్ వలన రకరకాల వ్యాధుల బారిన పడుతున్నామని. దీన్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం ఆ కెమికల్స్‌ను తగ్గించడమేనని సిఎం అభిప్రాయపడ్డారు. గ్రామస్ధాయిలో సమగ్రమైన ఆవగాహన, విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ప్రకృతివ్యవసాయంపై గ్రామస్ధాయిలో సరైన అవగాహన అవసరమన్నారు. దీని కోసమే ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (ఐజీ జీఏఏఆర్‌ఎల్)ను ఏర్పాటు చేసుకోబోతున్నామని వివరించారు.
రాష్ట్రంలో మొత్తం సుమారు 50 లక్షలు మంది రైతులుంటే.. కేవలం 6 లక్షలు మంది రైతులు మాత్రమే ప్రకృతిసాగులో మమేకమై ఉన్నారని వెల్లడించారు. దీనికోసం దీనికోసం ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉందని సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం 6 లక్షల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి సాగు ఉందన్నారు. జర్మన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వామ్యులను చేస్తామన్నారు.
Also Read : ఫసల్ భీమాలో ఏపీ భాగస్వామ్యం: సిఎం జగన్