Sunday, February 23, 2025
HomeTrending Newsఉద్యోగులకు సిఎం సహకారం ఎప్పుడూ ఉంటుంది

ఉద్యోగులకు సిఎం సహకారం ఎప్పుడూ ఉంటుంది

Part of Govt: సిఎం జగన్ ఈ మూడేళ్ళలో ప్రజలను ఎంత సంతోషంగా ఉంచాలని అనుకున్నారో, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను కూడా అంటే సంతోషంగా ఉండాలని కోరుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు అందించే వాహకులుగా పనిచేసే ఉద్యోగులపట్ల జగన్ కు ఎంతో అభిమానం ఉందన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో  ఏపీఎన్జీవోస్‌ సహకార గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాన్ని సజ్జల ప్రారంభించారు.

మనసున్న పాలకుడు ఉంటే, అయన పారదర్శకంగా ఉంటే, చేయగలిగినంత చేద్దామనే లక్ష్యం ఉంటే ఉద్యోగులనుంచి ఎలాంటి సహకారం అందుతుందనే దానికి ఈ గృహ సముదాయం నిర్మాణమే ఓ చక్కని ఉదాహరణ అని సజ్జల అభివర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్