Sunday, February 23, 2025
HomeTrending Newsపుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం

పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం

CM Kadapa Tour: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు వైయ‌స్ఆర్ జిల్లాలో పర్యటించారు. కడప ఎయిర్ పోర్ట్ లో మంత్రులు, ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు, అనంతరం నేరుగా రిమ్స్ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన  పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు.  అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలు పని చేసే విధానాన్ని వైద్యులు సిఎంకు వివరించారు.

ఆ తర్వాత కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్