Saturday, April 20, 2024
HomeTrending Newsజనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

జనవరి నుంచి పెన్షన్ కానుక పెంపు : సిఎం

వచ్చే జనవరి నుంచే వైఎస్సార్ పెన్షన్ కానుకను 2,750రూపాయలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కుప్పంలో వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల అకౌంట్లల్లో జమచేసే కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.  పెన్షన్ కానుకను మూడు వేల రూపాయల వరకూ పెంచుతామన్న హామీని తప్పకుండా నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.  ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకూ 1, 71, 244 కోట్ల రూపాయలు  వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించామన్నారు. ఈ మొత్తంలో 1,17,667  సంక్షేమ పథకాలన్నీ అక్క చెల్లెమ్మల పేర్ల మీదే అందిస్తునామని సిఎం జగన్ చెప్పారు.

జగనన్న అమ్మ ఒడి ద్వారా 44.50లక్షల మందికి రూ. 19,617 కోట్లు; వైఎస్సార్ ఆసరా ద్వారా  78.74 లక్షల మందికి రూ. 12,758 కోట్లు; వైఎస్సార్ చేయూత ద్వారా 26.40 లక్షల మందికి రూ.14,111 కోట్లు; మహిళా సంఘాల ‘0’ వడ్డీరుణాలపై రూ. 3, 615 కోట్లు… మొత్తంగా 51 వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు అందించామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్