Thursday, June 11, 2026
HomeTrending Newsకెసిఆర్ వ్యూహాలతో బిజెపికి అడ్డుకట్ట - ప్రేమ చంద్రన్

కెసిఆర్ వ్యూహాలతో బిజెపికి అడ్డుకట్ట – ప్రేమ చంద్రన్

జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని, దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ప్రేమ చంద్రన్ అన్నారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలలో కేసిఆర్ రాజకీయంగా బలమైన ప్రభావాన్ని చూపగలరని, కేసిఆర్ వ్యూహాలు చాలా పదునుగా ఉంటాయని కేరళ రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ప్రేమ చంద్రన్ స్పష్టం చేశారు. రివల్యుషనరి సోషలిస్టు పార్టీ ( R.S.P. ) సీనియర్ నాయకులు, కేరళ రాష్ట్రం కొల్లాం పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి ఎన్.కే. ప్రేమ చంద్రన్ తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాలలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రేమ చంద్రన్ స్పష్టం చేశారు.

జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలను, వివిధ రంగాల ప్రముఖులను ఒక తాటిపై తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ప్రేమ చంద్రన్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వినోద్ కుమార్ తో పంచుకున్నారు. నాలుగు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడమే కాకుండా కేరళ రాష్ట్రం జల వనరుల శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉన్న ప్రేమ చంద్రన్ బెస్ట్ పార్లమెంటేరియన్ గా, సంసద్ రత్న అవార్డు గ్రహీతగా హైదరాబాద్ రావడంతో ప్రేమ చంద్రన్ ఆహ్వానం మేరకు వినోద్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పార్లమెంటులో సహచర ఎం.పీ. గా ఉన్నప్పటి నుంచి ప్రేమ చంద్రన్ తో ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేరళ రాష్ట్రం పార్లమెంటు సభ్యులు ప్రేమ చంద్రన్ తో బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ఆర్.ఎస్.పీ. రాష్ట్ర నాయకులు కే. రేజీ కుమార్, వీ. సునీల్ లు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular