Sunday, January 19, 2025
HomeTrending Newsయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సిఎం ఆదేశం

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సిఎం ఆదేశం

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, SPSR నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ప.గో, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున విడుదలచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్