Saturday, July 27, 2024
HomeTrending Newsఈ-మెయిల్ ద్వారా NTR, Dr. YSR రంగస్థల పురస్కారాల దరఖాస్తు

ఈ-మెయిల్ ద్వారా NTR, Dr. YSR రంగస్థల పురస్కారాల దరఖాస్తు

ఈ ఏడాది నుంచి ‘డా. వై.ఎస్.ఆర్. రంగస్థల పురస్కారం’ పేరుతో నాటక సమాజాల ప్రోత్సాహానికి ఏటా ఒక అవార్డును ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ తుమ్మ విజయకుమార్ రెడ్డి నేడు ఓ ప్రకటనలో వెల్లడించారు. నాటక రంగంపై ఆసక్తిగల కళా ప్రియులకు వేదిక కల్పించి, ఆ రంగం వృద్ధికి గణనీయమైన కృషి చేసిన సమాజాలు, పరిషత్తులకు రూ.5,00,000 నగదు, ‘వైఎస్సాఆర్’ ప్రతిమ మొమెంటోతో  ఈ అవార్డు ద్వారా సత్కరిస్తారు.

నంది నాటకోత్సవాలు సందర్భంగా అదే వేదికపై వ్యక్తిగత స్థాయిలో నాటక రంగంలో విశేష కృషి చేసిన నటులకు, కళాకారులకు ‘ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం’ పేరుతో అవార్డును ఇప్పటికే ప్రభుత్వం ప్రదానం చేస్తున్నది.  కాగా ఇప్పుడు మొదటిసారి ఈ రంగంలో సమిష్టి కృషితో (టీమ్ వర్క్) పనిచేసిన సమాజాలకు, పరిషత్తులకు  వైఎస్సార్ రంగస్థల పురస్కారం ఇవ్వబోతోంది. ఆదరణ తగ్గుతున్న ఈ రంగానికి ప్రభుత్వం నుంచి కొత్తగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహం వల్ల, మళ్ళీ దీనికి పూర్వ వైభవం లభించాలనే కళాభిలాషుల ఆకాంక్ష నెరవేరనుందని విజయ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

NTR రంగస్థల పురస్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ లో నాటక రంగానికి విశేషంగా కృషిచేసిన “పౌరాణిక” నటీనటులు, వ్యక్తులు ….  Dr. YSR రంగస్థల పురస్కారం కొరకు నాటక సమాజాలు, పరిషత్తులు తమ తమ బయోడేటాలను సంబంధిత పత్రాలను డిసెంబర్ 10, 2023 లోగా [email protected] కు మెయిల్ పంపాలి. ఆన్ లైన్ లో పంపిన అన్ని పత్రాలనూ డిసెంబర్ 18, 2023 లోగా ఎఫ్ డి సి కార్యాలయానికి వ్యక్తిగతంగా గాని, పోస్ట్ ద్వారా గానీ పంపాలని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. చివరి తేదీ తరువాత అందిన దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్తం చేసింది. 

‘ఎన్టీఆర్ వైఎస్సార్ రంగస్థల పురస్కారాలకు అర్హులైన వ్యక్తులు, సమాజాలు, పరిషత్తులు ‘ఆన్ లైన్’ ద్వారా తమ దరఖాస్తులను డిసెంబర్ 10వ తేదీ లోగా పంపాలి. తగు ధృవ పత్రాలు జతచేసిన ధరఖాస్తులు డిసెంబర్ 18వ తేదీలోగా మేనేజింగ్ డైరక్టర్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ అభివృధి సంస్థ, ఆర్.టి.సి. కాంప్లెక్స్, ఎన్టీఆర్ అడ్మిస్ట్రేటివ్ బ్లాక్, 4వ ఫ్లోర్, విజయవాడ – 520013 చిరునామాకు చేరేట్టుగా పంపాలి.

ఈ పురస్కారాల ప్రదానం డిసెంబర్ చివరి వారంలో జరిగే నంది నాటకోత్సవాలు-2022 వేదికపై జరుగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్