Saturday, November 23, 2024
HomeTrending Newsవారిని నిలదీయండి: సిఎం పిలుపు

వారిని నిలదీయండి: సిఎం పిలుపు

Ask them on OTS-Jagan:
నిరుపేదలకు వారు నివసిస్తున్న ఇంటిపై  సంపూర్ణ గృహ హక్కును కల్పిస్తుంటే కొన్ని శక్తులు జీర్ణించుకోలేక పోతున్నాయని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘కేవలం నివాస హక్కు మాత్రమే అనుభవిస్తున్న పేదలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా… మంచి చేయడానికి ఆరాటపడుతున్న మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. ఆ జీర్ణించుకోలేని శక్తులు చంద్రబాబునాయుడుగారు కావచ్చు, ఈనాడు రామోజీరావు గారు కావచ్చు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కావచ్చు. పేదవాడికి ఎక్కడైనా మంచి జరిగితే వీళ్లందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. మీకెందుకు కడుపు మంట అని వాళ్లనే నేరుగా ప్రశ్నించండి’ అని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

దాదాపు 52 లక్షల మందికి వారి నివాస గృహంపై సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌ కల్పించి ఇచ్చే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని పశ్చిమగోదావరి జిల్లా తణుకు,లో ప్రారంభించారు. ‘దేవుడు దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అందులోనూ నా పుట్టిన రోజు నాడు దాదాపుగా 50 లక్షల పై చిలుకు కుటుంబాలకు మంచి జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు.

‘ఇళ్లు అంటే కేవలం ఇటుకలు, స్టీల్‌… వీటితో కట్టిన కట్టడం మాత్రమే కాదు. ఇళ్లు అంటే ఒక సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతీక. ఒక ఇల్లు  కట్టుకుంటే ఆ ఇంట్లో  సంతోషాలకు, ఆనందాలకు అది సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది’  అన్నారు. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు, పత్రికలు ఈ పథకంపై చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

‘దీనిపై ఆరోపణలు చేస్తున్న వాళ్లందరూ ఒకవేళ మీ దగ్గరకు వస్తే.. మీరు వాళ్లను కొన్ని ప్రశ్నలడగమని చెప్పి మిమ్మల్నందరినీ కోరుతున్నా’నని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘మీకున్నవి…, మీరు కొన్నవి రేట్లు పెరిగే రిజిస్టర్డు భూములు అయినప్పుడు, మాకూ అలాగే రేట్లు పెరిగే, నామమాత్రపు ధరకు ఉచితంగా రిజిష్టర్‌ చేసి, రిజిష్టర్డు ఇళ్లు ఇస్తాను అని మా అన్న చెపుతుంటే .. .మీకు ఎందుకు కడుపుమంట? అని అడగండి’ అన్నారు.

‘వాళ్లు వచ్చినప్పుడు వాళ్లను గట్టిగా అడగండి.. అయ్యా మా ఇళ్లను ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేటుకు మీరు కొంటారా ? అని అడగండి.’

‘ఎటువంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండా మా ఇంటిని మార్కెట్‌ రేటుకు మీరు కొంటారా ? అని చెప్పి గట్టిగా నిలదీయండి’

‘వాళ్లు వచ్చినప్పుడు వాళ్లను గట్టిగా అడగండి.. అయ్యా మీ వారసులకేమో మీ ఆస్తులు రిజిస్టర్‌ చేసి ఇస్తారు కదా?  మరి వా వారసులకు మా ఇళ్లు చట్టబద్దంగా రిజిస్టర్‌ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు ఇస్తుంటే మీకెందుకయ్యా కడుపుమంట? అని గట్టిగా అడగండి’ అని విజ్ఞప్తి చేశారు.

Also Read : నేడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్