Saturday, January 18, 2025
HomeTrending Newsవిభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేద్దాం: జగన్

విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేద్దాం: జగన్

టెక్కలి నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.4362 కోట్లు ఖర్చు తో నిర్మించే భావనపాడు పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు డిసెంబరులో పునరుద్ధరణ చేయబోతున్నామని తెలిపారు. నియోజక వర్గ వైఎస్సార్సీపీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతోన్న ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ నేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడిన సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సిఎం ప్రస్తావించిన అంశాల్లో కొన్ని….

  • ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి
  • ఒకటి మిమ్మల్ని కలవడం అయితే, రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది
  • 18 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నా ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతాం
  • గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది, మీరందరూ కూడా అందులో పాల్గొంటున్నారు
  • గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది

  • ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం
  • ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే… ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే… ప్రతి గ్రామంలోనూ 87శాతం ఇళ్లకు మంచిచేశాం
  • మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం?:
  • జగన్‌ చేసే పని జగన్‌ చేయాలి, అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి:
  • ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి
  • కేవలం ఏ ఒక్కరి వల్లనో ఇది జరగదు. నేను చేయాల్సింది నేను చేయాలి, మీరు చేయాల్సింది మీరు చేయాలి
  • అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది
  • టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు78 కి 74, ఎంపీపీలు 4 కి 4, జడ్పీటీసీలు 4 కి 4 గెలిచాం

  • మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.. పక్కనపెడదాం. బిగ్గర్‌పిక్చర్‌ గుర్తుకు తెచ్చుకుందాం
  • రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే 30 ఏళ్లూ మనం ఉంటాం
  • ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నింటి వల్ల రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయి
  • ఎలాంటి గొడవలున్నా అన్నీ పక్కనపెట్టేసి ముందడుగు వేద్దాం
  • అందరం కలిసికట్టుగా ఒక్కటి కావాలి…. అంటూ దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, కాళింగకార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్