Sunday, January 19, 2025
HomeTrending NewsYSRCP: శంషాబాద్ కు ధీటుగా భోగాపురం: గుడివాడ అమర్నాథ్

YSRCP: శంషాబాద్ కు ధీటుగా భోగాపురం: గుడివాడ అమర్నాథ్

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబాటులోనే ఉందని, ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంతాన్ని అబివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రూ.4,700 కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు మొదలుపెట్టామని, శంషాబాద్ తరహాలోనే భోగాపురం ప్రాంతం కూడా అబివృద్ధి చెంది 50 వేల మంది వరకు ఉపాది లభిస్తుందని చెప్పారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైఎస్సార్సీపీ సామాజిక సాదికార యాత్ర ఉత్తేజంగా సాగింది. మెయిద జంక్షన్ లో నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభకు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్ నాథ్, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ సారిపల్లి ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త మార్పులు తీసుకువచ్చి జగన్ పాలన సాగిస్తున్నారన్నారు.  పథకాలతో జగన్ డబ్బును దుర్వనియోగం చేస్తున్నాడని ఓసారి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం తాను చేస్తానని మరోసారి చంద్రబాబు అంటున్నారని,  రెండింటిలో దేనికి కట్టుబడి ఉంటాడో చెప్పాలని డిమాండ్ చేశారు.

పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో సామాజిక సాధికార యాత్ర సంబరంలా సాగుతోందని, అన్ని వర్గాల నాయకులు, ప్రజలు కలసి వేడకగా జరుపుతున్నారని అన్నారు. తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానపరిచిన చంద్రబాబును వెనక్కి పంపాలని, అందుకు వచ్చే ఎన్నికల్లో చేయి చేయి కలిపి సమిష్టిగా పని చేసి టిడిపిని నెట్టి వేయాలని పిలుపునిచ్చారు. బాబుపై చర్యలు తీసుకునే అవకాశం ప్రజలకు వస్తుందని, ఎన్నికల్లో ప్యాన్ బటన్ నొక్కి పంపేయాలని కోరారు.

కైకలూరులో 

సామాజిక యాత్ర ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఒక్కతాటిపైకి వచ్చి జగనన్న పక్షాన ఉన్నామని నిరూపించారని మంత్రి జోగి రమేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సామాజిక ధర్మాన్ని జగనన్న చేసి చూపాడని అన్నారు. 4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబకు తాను ఇలా చేశానని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు కైకలూరులో కదం తొక్కాయి.  వేలాదిగా రోడ్లపైకి తరలి వచ్చ సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.

జోగి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ ఆలోచన విధానాలను ఆచరణలో చూపించారని  – 2014లో ఇచ్చిన మేనిఫెస్టోకి సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో ఓటు అడగాలని సూచించారు. 2019 మేనిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు.

ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల్లోని పేద వర్గాలను తన కుటుంబసభ్యులుగా భావించిన సీఎం జగన్‌.
  • రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలన్నింటికీ జగనన్న అండగా ఉండి సంక్షేమ పథకాలు అందించారు.
  • నీతివంతమైన పాలన అందిస్తున్నారు. అవినీతికి తావు లేదు. జన్మభూమి కమిటీలు, దొంగల కమిటీలు ఇప్పుడు లేవు.
  • రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా ఏ సంక్షేమ పథకాన్నీ ఆపకుండా ప్రజలకు అందించిన ఘనత జగనన్నది.
  • పేదవాడి పిల్లల్ని సీఎం జగన్‌ చదివిస్తున్నారు. పోషక విలువలతో ఆహారం అందిస్తున్నారు.
  • కైకలూరులో పేద అక్కచెల్లెమ్మలకు 15 వేల ఇంటి స్థలాలు ఇచ్చారు.
  • నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.746 కోట్లు అందించిన ఘనత జగన్‌ దే
RELATED ARTICLES

Most Popular

న్యూస్