Sunday, January 19, 2025
HomeTrending Newsపోటీ పరీక్షలకు ఉపయోగపడాలి: సిఎం జగన్

పోటీ పరీక్షలకు ఉపయోగపడాలి: సిఎం జగన్

Cm Jagan Conducted Comprehensive Review On Ysr Village Libraries :

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న గ్రామీణ యువతకు విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ప్రతి లైబ్రరీకి అంతరాయంలేని బ్యాండ్‌విడ్త్‌ తో ఇంటర్నెట్‌ను అందించాలని ఆదేశించారు. తాజాగా వస్తున్న టెక్నాలజీని వినియోగించుకొని ఈ లైబ్రరీలను తీర్చిదిద్దాలని కోరారు. వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు:

ఈ సందర్భంగా సిఎం సూచనలు:
⦿ అనంతపురం, చిత్తూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి
⦿ వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలి
⦿ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలి
⦿ నిర్వహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
⦿ కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలి
⦿ ప్రతి లైబ్రరీలో డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్‌ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్‌ రాక్స్, పుస్తకాలు, మేగజైన్లు ఏర్పాటు చేయాలి
⦿ ఉగాది నాటికి ఫేజ్‌ 1 పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి
⦿ డిసెంబరు 2022 నాటికి ఫేజ్‌ 2; జూన్‌ 2023 నాటికి మూడో దశ పూర్తి చేయాలి
⦿ గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అంతరాయంలేని బ్యాండ్‌విడ్త్‌ తో కూడిన ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుంది

డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు
⦿ జనవరి నాటికి తొలిదశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామన్న అధికారులు
⦿ రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మాణం
⦿ మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామన్న అధికారులు
⦿ తొలివిడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణపనుల ప్రగతిపై సీఎంకు వివరాలందించిన అధికారులు

ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,  ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌ రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Must Read: కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకదృష్టి: సిఎం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్