Saturday, November 23, 2024
HomeTrending Newsఆలిండియా ర్యాంకర్లకు సిఎం అభినందన

ఆలిండియా ర్యాంకర్లకు సిఎం అభినందన

CM Jagan Congratulated And Gave Incentives To Aitt all India Rankers :

ఏఐటీటీ 2020లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్ధులను రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభినందించారు. ఒక్కో విద్యార్ధికి 5 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకం అందించారు, ఏపీఐఐసీలో వారి చదువుకు అనుగుణంగా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ (ఏఐటీటీ) 2020 లో క్రాఫ్ట్‌ మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (సీటీఎస్‌) జాతీయ స్ధాయి పరీక్షలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు టాప్‌ ర్యాంకులు సాధించారు.

వారిలో….

డి.మణికంఠ, మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌లో ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంక్‌

మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్‌ ఇండియా ఐదో ర్యాంక్‌

ఎన్‌.కుమారి, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఆల్‌ ఇండియా ఆరో ర్యాంక్‌

ఎం.బాల పవన్‌ రాజు, డ్రాఫ్ట్‌ మెన్‌ సివిల్, ఆల్‌ ఇండియా ఎనిమిదో ర్యాంక్‌

ఎం.రోషణ్, మెకానిక్‌ ఆర్‌ అండ్‌ ఏసీ, ఆల్‌ ఇండియా తొమ్మిదో ర్యాంక్‌….. లు నేడు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకున్నారు.

విద్యార్ధులతో పాటు కౌశలాచార్య అవార్డు 2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ వై.రజిత ప్రియను కూడా జగన్‌ అభినందించారు. ఆమెకు కూడా రూ. 5 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. విద్యార్ధులకు మెమెంటోలతో పాటు సర్టిఫికెట్‌లు, ట్యాబ్‌లను అందజేసిన సీఎం

ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి, రీజనల్‌ డైరెక్టర్‌ ఏ.వెంకటేశ్వర రావు, జాయింట్‌ డైరెక్టర్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Must Read :యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ: సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్