Sunday, January 19, 2025
HomeTrending Newsచెవిరెడ్డి, ధర్మారెడ్డి లకు సిఎం పరామర్శ

చెవిరెడ్డి, ధర్మారెడ్డి లకు సిఎం పరామర్శ

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి ఈవో ధర్మా రెడ్డి కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు,.  ధర్మారెడ్డి కుమారుడు చంద్ర మౌళి రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ముందుగా నంద్యాల జిల్లా పారు మంచాల గ్రామానికి చేరుకున్న సిఎం జగన్ చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి,  వారి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.


అనంతరం  అక్కడినుంచి బయల్దేరి ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ గుండా రేణిగుంట చేరుకొని అక్కడినుంచి చెవిరెడ్డి నివాసానికి వెళ్ళారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు.  చేవిరేడ్డిని, అయన కుటుంబ సభ్యులను సిఎం జగన్ పరామర్శించారు. సుభ్రమణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరి వెళ్ళారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్