Sunday, January 19, 2025
HomeTrending Newsపేద మహిళలకు వరం జగనన్న తోడు: సిఎం

పేద మహిళలకు వరం జగనన్న తోడు: సిఎం

జగనన్న తోడు ద్వారా 15 లక్షల 35వేల కుటుంబాలకు మంచి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టే అవసరం లేకుండా పదివేల రూపాయల రుణాలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. దీనిద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతోందన్నారు.

పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395  కోట్లు కొత్త రుణాలు ప్రభుత్వం అందిస్తోంది. దీనితో పాటు గత 6 నెలలకు సంబంధించిన రూ. 15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారులకు పెట్టుబడి ఎంతో కష్టంగా మారుతోందని, వెయ్యి రూపాయలు ఇస్తే దానిలో వందరూపాయలు ముందే తీసుకొని 900 రూపాయలు మాత్రమె ఇస్తుంటారని, ఇలాంటి సందర్భంలో ఈ పథకం వారికి ఓ వరంలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు అందించిన వడ్డీలేని రుణాల పథకం కింద  2,406 కోట్ల రూపాయలు అందించామన్నారు.  వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందిన వారు 8,74,745 మంది ఉన్నారని తెలిపారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.63.65 కోట్లు అని వివరించారు.  ఇలాంటి పథకం దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని సిఎం అభివర్ణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్