Monday, February 24, 2025
HomeTrending Newsఇది నాకు దేవుడిచ్చిన అవకాశం : సిఎం జగన్

ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం : సిఎం జగన్

దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉందని,  అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 నుండి 20 లక్షల వరకూ ఒక ఆస్తిని ఇవ్వగలిగామని,  ఈ అవకాశం దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

ఇళ్ళ నిర్మాణంలో భాగంగా  కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నామని,
12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈ రుణాలు అందాయని,  నేడు 4.07 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్‌ కింద రూ.46.9 కోట్లు విడుదలచేస్తున్నామని, గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల వరకూ ఇచ్చామని…  ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుందని వివరించారు.  ఒక్కో ఇంటి నిర్మాణానికి 2.7 లక్షల రూపాయలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోందని,  ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని,  సిమెంటు, స్టీల్‌, మెటల్‌ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రిమీద కనీసంగా రూ.40వేల వరకూ మంచి జరిగేలా చూస్తున్నామని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్