Sunday, January 19, 2025
HomeTrending NewsVizag Capital: జగన్ లో మార్పు రాలేదు: అచ్చెన్న

Vizag Capital: జగన్ లో మార్పు రాలేదు: అచ్చెన్న

డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సిఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే సెప్టెంబర్ నుంచి విశాఖకు మకాం అంటూ నేడు జగన్ ప్రకటించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధానిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంటే ఈ అంశంపై ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికే జగన్  ఈ ప్రకటన చేశారన్నారు. మూలపేట పోర్టు శంఖుస్థాపన పెద్ద బూటకమని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టిన తరువాత జగన్ లో మార్పు వస్తుందని అనుకున్నామని, కానీ ఎలాంటి మార్పూ రాలేదని వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతలు ఇప్పటికే విశాఖలో 40 వేల కోట్ల రూపాయల విలువైన భూములు కొల్లగొట్టారని, మరింత లూటీ చేయడానికే విశాఖలో కాపురమా అని అచ్చెన్న నిలదీశారు. సొంత మీడియా లేదంటున్న జగన్ సాక్షి ఎవరిదో చెప్పాలన్నారు.  జగన్ కంటే పెత్తందారు ఎవరుంటారని అడిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్