Friday, September 20, 2024
HomeTrending NewsYS Jagan: వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి: జగన్ ధ్వజం

YS Jagan: వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి: జగన్ ధ్వజం

తమ పాలనలో రాష్ట్రంలో ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కాబట్టే ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని, వారి మైండ్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  చంద్రబాబు అధికారంలో  ఉన్నప్పుడు ఇలా… ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు ఇంతింత డబ్బులు  పడటం ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం అమలు చేస్తూ రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా నా దళితులకు గానీ, నా బీసీలకు గానీ, నా ఎస్సీలకు గానీ, నా మైనార్టీలకు గానీ, నా అక్కచెల్లెమ్మలకు గానీ ఎప్పుడైనా ఇచ్చారా అని నిలదీశారు. అమలాపురంలో మహిళా సంగాలకు సున్నా వడ్డీ రుణాలు పథకం కింద నాలుగో ఏడాది వడ్డీ నిధులను మహిళల అకౌంట్లలో జమ చేసిన సిఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పుంగనూరు ఘటనను కూడా సిఎం ప్రస్తావించారు. అనుమతి లేదనిపోలీసులు చెప్పినా ఆ రూట్ లోనే వచ్చి 47మంది పోలీసులకు గాయాలు అయ్యేలా రెచ్చగొట్టారని బాబును ఉద్దేశించి జగన్ నిప్పులు చెరిగారు.

28 సంవత్సరాల కిందటే సీఎం అయి 14 ఏళ్ళు ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమైనా మీకు గుర్తుకు వస్తుందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు.  ఇలాంటి వ్యక్తికి ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని, పైగా  ఈయనను  ఈ కుర్చీలో కూర్చోబెట్టడానికి దత్త పుత్రుడు ఎందుకు పరుగెడుతున్నాడని  అన్నారు.

జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • దత్తపుత్రుడు సీఎం కావడానికి కాదట. ఇలాంటి చంద్రబాబును సీఎం చేయడానికట.
  • ఇలాంటి వ్యక్తి సీఎం అయితేమనకు మంచి జరుగుతుందా? ఆలోచన చేయమని కోరుతున్నా
  • తనకు అధికారం ఇస్తే వీళ్ల నోట్లో నుంచి వస్తున్నమాటలు.
  • తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. మట్టుబెడతాడట. ఉగ్రరూపం చూపిస్తాడట. ఏకంగా నరకం చూపిస్తాడట. ఇందు కోసం ఆయనకు అధికారం ఇవ్వాలట.
  • ఇదీ ఆయన, ఆయన దత్తపుత్రుడు, ఆయన సొంత పుత్రుడు.. ఈ మాటలు మాట్లాడుతున్నారు.
  • నిజంగా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడుగారి మనస్తత్వం.. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు.ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనివారికి నరకం చూపించాడు.
  • బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు. తోలు తీస్తా అన్నాడు. తాట తీస్తా అని బెదిరించాడు.
  • బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నరకం చూపించాడు.
  • మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొని నరకం చూపిస్తున్నాడు.
  • ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఏరోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. అన్యాయం చేశాడు.
  • కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడవాళ్లను అగౌరవ పరిచాడు.

  • ఈరోజు మైకు పట్టకున్నాడు. ఊదరగొడుతున్నాడు. 2014 సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి.
    బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట.
  • అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట.
  • నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలట..
  • రైతులకు రుణాలు మాఫీ అని చెప్పి 85712 కోట్ల రుణాలు మాఫీ అని మోసం చేశాడు.
  • 14207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు.
  •  పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను, ఇంటింటికీ 2 వేలు భృతి ఇస్తా అన్నాడు.
  • ప్రతి ఇంటికీ 2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ 24 వేలు అంటే 5 సంవత్సరాల్లో లక్షా 25 వేలు. ఎంత మంది పిల్లలకు ఇచ్చాడు.
  •  ఆలోచన చేయమని అడుగుతున్నా. మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు.
  • కేవలం ప్రజల్ని ఎన్నికలప్పుడు మోసం చేయాలి. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు.
  • వీళ్లకు అధికారం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు.. ప్రజల ముఖంలోచిరునవ్వులు చూసేందుకు కాదు..
  • ఈ 5 సంవత్సరాల్లో మీ బిడ్డ మీకోసం 2.31 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఎక్కడా
  • ఈరోజు నిజంగా పూర్తిగా వీళ్లందరికీ కూడా ఆలోచన ఏ స్థాయిలో ఉందంటే ప్రజలకు మంచి చేస్తామనే కాదు, ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు.
  • కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. – అబద్ధాలు చెబుతారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెడితే ఇష్టమొచ్చినట్లుగా రెచ్చగొట్టే మాటలుమాట్లాడతారు.

  • ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది.
  • కేవలం రెచ్చగొట్టి అంగళ్లు అనే ఒక చోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలుచేయించి, మళ్లీ పుంగనూరులో ఆ రూటుకు పర్మిషన్‌ తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు.
  • పోలీసులు పర్మిషన్‌ లేదని చెబితే, అధికార పార్టీ వాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లమ్‌ వస్తుందని చెబితే ఇష్టమొచ్చినట్లు తిట్టాడు.
  • 47 మంది పోలీసులకు గాయం చేశాడు. ఒక పోలీసు సోదరుడికి కన్ను పోగొట్టాడు.
  • గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు.
  • మంచి చేయడం కోసం వాలంటీర్లు మీ దగ్గరికే వస్తున్నారు. ఈ వాలంటీర్లంతా మీ ఇంటికి చుట్టుపక్కల ఉన్నమీ బిడ్డలే.
  • వాళ్లవదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. ఆలోచన చేయాలని అడుగుతున్నా.
  • రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు, అబద్ధాలు ఎక్కువ అవుతాయి. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు కొనిస్తామని చెబుతారు.
  • ఎలాంటి మనిషి మీకు నాయకుడిగా కావాలని ఆలోచన చేయండి.
  • నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా లేరు. కానీ వీళ్లను నమ్ముకోలేదు.
  • మీ బిడ్డనునమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్నే.
  • మీ అందరితో కోరేది ఒకటే మీ ఇంట్లోమీకు మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి.
  • మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.
  • మీ చల్లని దీవెనలు, దేవుడి చల్లని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఇంకా మెరుగ్గా ఉండాలని, మీకు మంచి చేసే అవకాశం ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా
RELATED ARTICLES

Most Popular

న్యూస్