Monday, January 20, 2025
HomeTrending Newsఎల్లుండి ఢిల్లీకి సిఎం- ప్రధానితో భేటీ!

ఎల్లుండి ఢిల్లీకి సిఎం- ప్రధానితో భేటీ!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి, డిసెంబర్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో జగన్ భేటీ కానున్నారు. నవంబర్ 11, 23 న విశాఖలో పర్యటించిన ప్రధాని మోడీ 12న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జగన్  కూడాపాల్గొని ప్రసంగించారు. మోడీతో తమ బంధం రాజకీయాలకు అతీతమైనదని చెప్పారు. అదే పర్యటనలోజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ తో కూడా మోడీ సమావేశమయ్యారు.

ఎల్లుండి ఢిల్లీ పర్యటన సందర్భంగా సిఎం జగన్ నర్సీపట్నం పర్యటన వాయిదా పడింది. ఎల్లుండి బదులు శుక్రవారం 30న జగన్ నర్సీపట్నంలో పర్యటించి వెయ్యి కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్