సిఎం జగన్ నర్సాపురం పర్యటనలో నల్ల దుస్తులు, చున్నీలు ధరించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంతి అభద్రతా భావంలో ఉన్నారని మండిపడ్డారు. దీనిపై ఓ పత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత” అంటూ బాబు వ్యాఖ్యానించారు.