పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లలో మూడురోజుల పర్యటనలో ఉన్న సిఎం జగన్ నేడు రెండో రోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 36.03 కోట్ల రూపాయలతో సింహాద్రిపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు
పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ 11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్ లను మొదట ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఫోర్ లైన్ సిసి రోడ్, బి.టి రోడ్ జంక్షన్ లు ఉన్నాయి. అనంతరం రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్,చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ , వైఎస్ఆర్ విగ్రహం ..లను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ 3.19కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ను, రూ 2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ ను,రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును ఆయన ప్రారంభించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు,జెసి గణేష్ కుమార్, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి,పులివెందుల ఆర్డీవో వెంకటేశం, నాయకులు, తదితరులు సిఎం వెంట పర్యటనలో ఉన్నారు.