Saturday, November 23, 2024
HomeTrending Newsపాలనలో మార్పు గమనించండి: సిఎం జగన్

పాలనలో మార్పు గమనించండి: సిఎం జగన్

విజయవాడ నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు.  రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును  ప్రారంభించామని, బెంజ్ సర్కిల్ వద్ద పెండింగ్ ఫ్లై ఓవర్లు, కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని గుర్తు చేశారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రారంభోత్సవంతో పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు  సిఎం జగన్ అందజేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఈరోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
  • రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది.
  • కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు రెండు వైపులా ఈ కరకట్ట వాల్స్  దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నాం

  • ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా
  • అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
  • ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న ఔట్లపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి.
  • గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నా.
  • ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం.
  • అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి అభివృద్ధి అంటారు.
  • ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి.

  • గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
  • వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం, ఏ ఒక్కరూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నా.
  • ఇటువైపున పార్కుకు, అటు వైపున పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడదాం. థ్యాంక్యూ.
RELATED ARTICLES

Most Popular

న్యూస్