Saturday, November 23, 2024
HomeTrending Newsవిజయవాడ ఇకపై సామాజిక చైతన్యవాడ: సిఎం జగన్

విజయవాడ ఇకపై సామాజిక చైతన్యవాడ: సిఎం జగన్

స్టాచ్యూ అఫ్ లిబర్టీ అంటే అమెరికా ఎలా గుర్తుకు వస్తుందో ఇకపై స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అనే పేరు మార్మోగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు.  ఈ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా పేర్కొన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* ఈరోజు మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యవాడగా కనిపిస్తోంది.
* ఈ మహా విగ్రహం ఇది స్టాచూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం.
* ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతోంది.
* బాబా సాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బతికే ఉంటాడు. ఎప్పటికీ మన అడుగులుల్లో, మన బతుకుల్లో భావాల్లో కనిపిస్తుంటాడు.
* ఈ దేశంలో పెత్తందారీ తనం మీద, అంటరాని తనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద ఆ దుర్మార్గాల మీద అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహా మనిషి.
* విజయవాడలో అది కూడా స్వాతంత్ర్య సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకు సరిగ్గా వారం రోజుల ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేద్కర్ గారి మహా విగ్రహం.
* ఈ విగ్రహం చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్పూర్తి ఇస్తూనే ఉంటుంది.
* ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా మనకు కనిపిస్తుంటాడు.
* ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా ఎప్పుడూ మనందరికీ ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు కనిపిస్తుంటాడు.

* అంటరాని తరాన్ని స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, విప్లవాన్ని, స్వాతంత్ర్య పోరాటాన్ని ఉమ్మడిగా చూస్తే, ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు.
* అటువంటి పరిస్థితులు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా వేర్వేరు రూపాల్లో ఇవాళ్టికీ ఉన్నాయి.
* అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే.
* అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడమే కాదు.. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని తెలియజేస్తున్నా.
* డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగుమీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. పొద్దున్నే పత్రిక చదివా.
* అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అన్నారట.
* ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట.
* వీళ్ల మాటలు చూస్తే ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తే బాధేస్తుంది.
* అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో, 4వ తరగతి పాసై నప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారట.
* కానీ ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైనమేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులకు, బహుజనులకు వ్యతిరేకులు.

* చివరికి చరిత్ర కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తున్నారంటే ఏ స్థాయికి పాత్రికేయం పడిపోయిందని ఆలోచన చేయమని కోరుతున్నా.
* పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగా ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట.
* తమ అవసరాలు తీర్చేవారుగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* పేదలు ఏ ఆస్పత్రిలోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందుతోందో, అటుటవంటి ఆస్పత్రులు నీరుగార్చడం,

* పేదలు బస్సుల్లో ఎక్కుతున్న ఆర్టీసీని కూడా ప్రయివేటుకు అమ్మేయాలనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* ఏ పౌర సేవ కావాలన్నా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా, లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగడం, వారి సహనాన్ని పరీక్షించడం కూడా.. రూపం మార్చుకున్న అంటరాని తనమే.
* అవ్వాతాతలకు పెన్షన్, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో నిలబడి, క్యూల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే.

* ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజికవర్గాలకు చోటు లేకుండా తాముమాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వాదించడం కూడా రూపం మార్చుకున్నఅంటరానితనమే.
* మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు సైతం వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.
* పేద వర్గాల పిల్లలకు ట్యాబులిస్తే అందేలో చూడకూడనివి చూస్తున్నారంటూ వాళ్ల పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులున్నాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోతూ డిజిటల్ లిట్రసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపంమార్చుకున్న అంటరానితనమే.
* స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అలాగే మిగిలిపోయిన రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంటుంది.
* ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా
* పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు గ్రామ స్థాయిలోనే లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థను తీసుకురావాలని, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం తేవాలని ప్రతి పేదవాడికీ అందుబాటులతో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది?
* పెత్తందారీ పార్టీలు నాయకులకు నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లోనూ 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ 50 శాతం పదవులు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేయాలని వాళ్లకు ఎందుకు అనిపిస్తుంది.
* మంత్రిమండలిలో ఏకంగా 4 డిప్యూటీ సీఎం పదవులు, నానానా అంటూ నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనార్టీలకు మనం ఇస్తే, మంత్రి మండలిలో 68 శాతం మంత్రి పదవులు మనం ఇస్తే సామాజికపరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 56 నెలల్లో అడుగులు పడ్డాయి.
* శాసనసభ స్పీకర్ గా బీసీ, శాసన మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.

* మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారు.
* మన పార్టీ మండలిలో 43 మంది సభ్యులుంటే 29 మంది నా నా నా అని నేను పిల్చుకుంటున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే.
* 13 జెడ్పీ చైర్మన్ పదవులుంటే అందులో 9 నా నా నా అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే.


* 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 12 నానానా అంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములే.
* 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకుంటే ఏకంగా 58 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే.
* 196 మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉంటే 117 ఏకంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే.
* 137 కార్పొరేషన్ చైర్మన్ పదవులుంటే 79 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే.
* మొత్తంగా రాజకీయ నియామకాలు, పదవుల్లో సగానికిపైగా నా అక్కచెల్లెమ్మలున్నారని గర్వంగా చెప్పగలుగుతున్నా.
* మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే.
* ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా?
* ఈరోజు ఈ పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు.. వారి కోసం నవరత్నాల పాలన అందించాలని, కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మమకారం చూపాలని వీళ్లకు ఏరోజైనా అనిపించిందా?
* మీ బిడ్డ పాలనలో 56 నెలల కాలంలో 2.47 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కుతున్నాడు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి.
* ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మరి రాష్ట్రాన్ని దోచుకొనేందుకుమాత్రమే పదవులు కావాలని ఆకాంక్షిస్తున్న పెత్తందారీ పార్టీలు, నాయకులకు ఏరోజైనా బటన్ నొక్కడం, 2.47 లక్షల కోట్లు పేద అక్కచెల్లెమ్మలకు పోతుందని ఏరోజైనా అనిపించిందా?
* ఇవన్నీ కూడా సామాజిక న్యాయాన్ని అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలు.
* గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తారు.
* 2 వేల జనాభాకు సచివాలయం, 50 ఇళ్లకు వాలంటీర్, లంచాలు, వివక్షలేకుండా ప్రతి పేదవాడు, రైతన్నను, అక్కచెల్లెమ్మనుచేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామ
స్వరాజ్యం అంటే ఇదీ అంబేద్కర్ కలలుగన్న రాజ్యం ఇది అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు.
* మనం ఆచరించిన విధానాలకు ప్రతీకగా ఈ సామాజిక న్యాయ మహాశిల్పం అనేదాన్ని మనం నిర్మించుకున్నాం. ఆవిష్కరణ చేస్తున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్