Sunday, September 8, 2024
HomeTrending Newsవైద్యరంగంలో సదుపాయాల కల్పన: సిఎం జగన్

వైద్యరంగంలో సదుపాయాల కల్పన: సిఎం జగన్

Medical Infrastructure: వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, కరోనాకు ముందు రాష్ట్రంలో కనీసం ఒక్క వైరల్ ల్యాబ్ లేని పరిస్థితి నుండి నేడు 20 వైరల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 426 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం సామర్ధ్యం గల 144 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లతో సహా క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ కంటైనర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్‌ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను వర్చువల్‌ విధానంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి సిఎం జగన్  ప్రజలకు అంకితం చేశారు. పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా  చేసే నమూనాను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే 144 పీఎస్‌ఏ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటు చేశామని తెలిపారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు, 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు, 20 కోట్ల రూపాయల వ్యయంతో వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు సిద్ధంగా ఉంచామని వివరించారు.]

సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితిని నివారించేందుకే అన్ని  ప్రభుత్వాస్పత్రుల ఆవరణలోనే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల పై 30% సబ్సిడీ ఇస్తున్నామన్నారు.

కోవిడ్ మేనేజ్మెంట్ లో వైద్యశాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇప్పటివరకు 82 శాతం టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని రాష్ట్రవ్యాప్తంగా 33 సార్లు డోర్ టు డోర్ సర్వే జరిగిందాని పేర్కొన్నారు. కోవిడ్ మూడో వేవ్ ను ధీటుగా ఎదుర్కునేందుకు తయారుగా ఉన్నామన్నారు.  మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, వీటి ఏర్పాటు ద్వారా ప్రాణవాయువుకు కొరత ఉండదు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతామని సిఎం అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్