మహా శివరాత్రి సందర్భంగా ప్రతియేటా నిర్వహించే శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. సిఎంకు స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి అర్వేచకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు పాల్గొన్నారు. ఫిబ్రవరి 13 న మొదలయ్యే బ్రహ్మోత్సవాలు 26న ముగియనున్నాయి.