విశాఖపట్నంలో 300 మెగావాట్ల డేటాసెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. విశాఖ ప్రగతిలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని, డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా సింగపూర్ నుంచి సబ్‌మెరైన్ కేబుల్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.
విశాఖలో రుషికొండ ఐటీహిల్-4 వద్ద 134 ఎకరాల్లో ఐటీ పార్క్ (అదానీ డేటా సెంటర్) నిర్మాణ పనులకు సీఎం జగన్, కరణ్ ఆదానీతో కలిసి భూమిపూజ చేశారు. రూ.22 వేలకోట్ల పెట్టుబడులతో నెలకొల్పనున్న ఈ డేటా సెంటర్ తో 45 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా సిఎం జగన్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు:
- ఇది విశాఖ అభివృద్ధిని మరింత పెంచుతుంది
- ఈ తరహా ఆధునిక సదుపాయావల్ల విశాఖ నగరం మహానగరంగా ఎదగడానికి దోహదపడుతుంది
- 39 వేల మందికి ఉపాధి కలుగుతుంది
- 21,800 కోట్ల పెట్టుబడి విశాఖకు వస్తుంది
- సహజనవనరుల ద్వారా లభించే విద్యుత్తునే ఈ డేటా సెంటర్‌కు వినియోగిస్తారు
- 190 ఎకరాల భూమిని కేటాయించాం
- డేటా సెంటర్ పార్కుతోపాటు, ఐటీ సెంటర్ పార్కు, స్కిల్ డెవలప్‌మెంట్ సదుపాయం, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటవుతుంది
- క్లౌడ్ సర్వీసులు కూడా మెరుగుపడతాయి
- తద్వారా ఐటీ కార్యకలాపాలను వేగంగా ఊపందుకుంటాయి
- ఇంటర్నెట్ కనెక్టివిటీ, వినియోగం, ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరుగుతుంది
- డేటా డౌన్లోడ్, అప్‌లోడ్ శరవేగంగా జరుగుతాయి
- విశాఖలో డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దది
- అదానీ గ్రూపునకు నా ధన్యవాదాలు