Saturday, November 23, 2024
HomeTrending Newsదేశ చరిత్రలోనే మైలురాయి: 'ఆడుదాం ఆంధ్రా' ప్రారంభం

దేశ చరిత్రలోనే మైలురాయి: ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభం

గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెలికి తీయడం, క్రీడల ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై అవగాహన కలిగించడం ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్తం చేశారు. నేడు మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు 47 రోజులపాటు ఫిబ్రవరి 10వరకూ  ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో ప్రతీ క్రీడాకారుడికి ప్రోత్సాహం ఇచ్చే ఈ ‘ఆడుదాం ఆంధ్ర’ దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నానంటూ వ్యాఖ్యానించారు.  గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలను సిఎం జగన్ లాంఛనంగా  ప్రారంభించారు.

సిఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుంది.
* దీని ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.
* ఒకటి.. వ్యాయామం, స్పోర్ట్స్‌ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయంపై ఒక అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌గా ఉపయోగపడుతుంది.
* క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయడం వల్ల బ్లడ్‌ ప్రజర్‌లాంటివి కంట్రోల్‌లో ఉంచగలుగుతాం
* టైప్‌2 డయాబెటిస్‌ లాంటివి నిరోధించడంలో  స్పోర్ట్స్‌ క్రియాశీలకంగా పనిచేస్తాయి
* వ్యాయామం ఎంతో అవసరమన్నదానిపై గ్రామస్థాయిలోకి మెసేజ్‌ తీసుకొనిపోయే గొప్ప కార్యక్రమం ఇది.
* టీబీ ఎక్కువయిందంటే గుండెపోటుకు చెందిన అనేక రకాల రోగాలు వస్తాయి.
* షుగర్‌ ఎక్కువైనా కూడా కిడ్నీ, న్యూరాలజీకి సంబంధించిన రోగాలు వస్తాయి.
* ఇటువంటివన్నీ కంట్రోల్‌లో ఉండాలంటే  వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరం

* గ్రామ స్థాయి నుంచే ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తున్నాం.
* రెండో ముఖ్యమైన ఆబ్జెక్టివ్‌.. గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం
* అలాంటి ముత్యాలను బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా పరిచయం చేయడం
* ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సాయంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి టీములు ముందుకొచ్చాయి.
* క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకొచ్చింది.
* ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా  భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు.
* నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెసనల్‌ లెవల్‌లో వీళ్లంతా పార్టిసిపేట్‌ చేస్తారు.
* బ్యాడ్మింటన్‌కు సంబంధించి కిడాంబి శ్రీకాంత్‌, పివి సింధు ఉన్నారు.
* వీళ్లకు మన రాష్ట్రంలో ఒకరికి విశాఖలో ల్యాండ్‌, ఇంకొకరికి తిరుపతిలో ఇచ్చాం.
* బ్యాడ్మింటన్‌ అకాడమీస్‌ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది.
* మెంటార్లుగా మన ట్యాలెంట్‌ను గుర్తించడంలో, వజ్రాలుగా మలచడంలో వీరు తోడుగా ఉంటారు
* ప్రైమ్‌ వాలీబాల్‌, ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు రావడం జరిగింది.
* రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లంతా కలిసి పని చేస్తారు.
* ఈ కార్యక్రమం ఇక మీదట నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది
* ప్రతి ఏటా గ్రామస్థాయి నుంచి మొదలై, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి.

* గ్రామాల్లో అవేర్‌నెస్‌ క్రియేట్‌ అవుతుంది. ఆరోగ్యపరమైన అవేర్‌నెస్‌, మరో రకంగా ట్యాలెంట్‌ హంట్‌
* మరిన్ని ఆణిముత్యాలు మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపిస్తాయి
*రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయస్థాయి నుంచి 34.19 లక్షలమంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
* 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేసేందుకు ముందుకొచ్చారు.
* 1.22 కోట్ల మంది మన పిల్లలకు తోడుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు.
* 15 వేల సచివాలయాల పరిధిలో, ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించడం జరిగింది.
* ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్‌ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను గుర్తించడం జరిగింది.
* రాబోయే కాలంలో అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ప్రతి స్కూల్లోనూ ఎంకరేజ్‌ చేస్తాం
* స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటూ పోతాం
* మీ అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ విషెస్‌ మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.

RELATED ARTICLES

Most Popular

న్యూస్