Sunday, January 19, 2025
HomeTrending Newsఆగస్ట్ 1న విశాఖకు సిఎం- ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ

ఆగస్ట్ 1న విశాఖకు సిఎం- ఇనార్బిట్ మాల్ కు భూమి పూజ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 1న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కే. రహేజా గ్రూపు నిర్మించ తలపెట్టిన ఇనార్బిట్ మాల్ పనులకు భూమి పూజ చేయనున్నారు.

ఇటీ వల కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా,  నార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలిసి ఆహ్వానించారు.  విశాఖ ఉత్త‌ర అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం సాలిగ్రామ‌పురంలో ఉన్న నౌకాశ్ర‌య గెస్ట్ హౌస్‌ల స్థ‌లంలో ఈ మాల్ నిర్మాణం కానుంది. దీనికి గాను 17 ఎక‌రాల‌ను రూ.125 కోట్ల‌ను చెల్లించి 30 ఏళ్ల పాటు ర‌హేజా గ్రూప్‌ లీజుకు తీసుకుంది.   6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో,  మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడులను కె రహేజా గ్రూప్‌ పెడుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్