నెల్లూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ రీజినల్ కోర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డిలు సిఎం జగన్ తో సమావేశం అయ్యారు.
అంతకుముందు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స, మాజీ మంత్రి పేర్ని నాని సిఎం తో భేటీ అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి, తాజాగా మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి లు చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై వారు చర్చించారు.
ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా నియమించిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ కు ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ ఛార్జ్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.