Sunday, January 19, 2025
HomeTrending NewsGood Friday: జీసస్ మహాత్యాగమే గుడ్‌ ఫ్రై డే సందేశం: సిఎం జగన్‌

Good Friday: జీసస్ మహాత్యాగమే గుడ్‌ ఫ్రై డే సందేశం: సిఎం జగన్‌

గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవ సోదరులకు సందేశం ఇచ్చారు. “కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు” అని సిఎం జగన్  అన్నారు.

“మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్‌ లోకానికి ఇచ్చిన సందేశాలు” అని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు.

Also Read : YSR Village Health Clinic: ప్రజలే నా సైనికులు: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్