Monday, February 24, 2025
HomeTrending Newsఇలాంటి వారిని ఎక్కడైనా చూశారా?: జగన్

ఇలాంటి వారిని ఎక్కడైనా చూశారా?: జగన్

Did u See? కొడుక్కి మోసాలు, పచ్చి అబద్ధాల్లో  ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  మంత్రిగా పనిచేసి మంగళగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు…. ప్రజలను కాక ఇలాంటి వారిని నమ్ముకుంటున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబును ఎక్కడైనా చూశారా అని అడిగారు.  కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్ మత్స్య కార భరోసా కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీలపై మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  కుప్పం నియోజకవర్గానికి 27 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చంద్రబాబు ఇప్పటివరకూ అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని… కానీ మూడేళ్ళ తమ పాలన చూసిన తరువాత ఇప్పుడు అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేస్తుకున్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ జగన్ కొన్ని ప్రశాలు సంధించారు.

పరీక్షా పత్రాలు వీళ్ళే లీక్ చేయించి, లీక్ చేసిన వారిని సమర్ధించిన, అరెస్టులు చేస్తే అడ్డుకుంటున్న  ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?

లేబర్ మంత్రిగా ఉంటూ ఉద్యోగుల ఈఎస్ఐలో నుంచి ఫౌడర్లు, మందులు, టూత్ పేస్టుల పేరిట డబ్బులు కొట్టేసిన నేతలు విచారించకూడదని చెబుతున్న ఇలాంటి ప్రతిపక్షాన్ని  మీరెక్కడైనా చూశారా?

రాజకీయ నాయకుడెవరైనా ప్రజలను నమ్ముకుంటారని, కానీ కానీ ప్రజలను కాకుండా దత్తపుత్రుడిని, కొడుకుని నమ్ముకుంటున్న ఇలాంటి నేతను ఎకడైనా చూశారా?

పేదలు ఇళ్లస్థలాలు వారు ఇవ్వకపోగా తమ ప్రభుత్వం ఇస్తుంటే కోర్టుల కెళ్ళి అడ్డుకుంటున్న ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశారా ? అని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి జగన్ నిలదీశారు.

ఎన్నికల హామీల్లో 95శాతం మూడేళ్ళలోనే అమలు చేశామని,  ఇంటింటికీ తిరిగి ఈ విషయాన్ని చెప్పుకునే నైతికత తమకే ఉందన్నారు. అందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వస్తున్నారని చెప్పారు. నిజాయతీతో, నిబద్ధతతో ప్రజల వద్దకు వస్తున్నాం కాబట్టే దుష్టచతుష్టయం తట్టుకోలేకపోతోందని టిడిపి, కొన్ని మీడియా సంస్థలపై సిఎం జగన్ మండిపడ్డారు. వీరికి దత్త పుత్రుడు కూడా తోడయ్యారని వ్యాఖ్యానించారు.  వీరికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్య శ్రీ ద్వారా జగన్ వైద్యం చేయిస్తాడు కానీ, ఈర్ష్యకు, కడుపు మంటకు వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడని వ్యంగ్యంగా అన్నారు.

ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేని ఇలాంటి ప్రతిపక్షాన్ని రాష్ట్ర ద్రోహులు అనాలో, దేశద్రోహులు అనాలో ఆలోచించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.  కళ్ళుండీ తమ ప్రభుత్వం చేస్తోన్న మంచి చూడలేని, వక్రబుద్ధి ఉన్న దుష్టచతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు  సిఎం వ్యాఖ్యా నించారు.

Also Read : ఛాలెంజ్ గా తీసుకుని పనిచేద్దాం: సిఎం సూచన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్