Saturday, January 18, 2025
HomeTrending Newsబాపట్లలో 11న జగనన్న విద్యా దీవెన

బాపట్లలో 11న జగనన్న విద్యా దీవెన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న బాపట్ల జిల్లా లో పర్యటించనున్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జగనన్న విద్యా దీవెన పథకం ఈ ఏడాది రెండో త్రైమాసికం నిధులను తల్లుల అకౌంట్లలో  జమ చేయనున్నారు.

బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి జిల్లాకు వస్తున్న సిఎం జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ కర్త తలశిల రఘురాం బాపట్ల చేరుకొని, మంత్రి మేరుగ నాగార్జున, స్థానిక శాసన సభ్యులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, స్థానిక వైయస్ ఆర్ సిపి నేతలు, జిల్లా అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్