Sunday, November 24, 2024
HomeTrending Newsసంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు

సంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు

ప్రజలందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలలో సంక్రాం సంబరాలు ఘనంగా జరిగాయి. జగన్‌ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం సందేశం ఇస్తూ  ‘ఇక్కడికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు, అవ్వాతాతలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు” తెలిపారు.

తొలుత సిఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.  గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వైభవంగా వేడుకలు జరిగాయి.   ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో  డిప్యూటీ సీఎం (దేవాదాయశాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను తదితరులు కూడా పాల్గొన్నారు.

కూచిపూడి నృత్య ప్రదర్శన, జానపద గాయని కనకమ్మ, ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘కొమ్మ ఉయ్యాలో’ పాట పాడిన ప్రకృతి రెడ్డి, హారికానారాయణ్ పాడిన ‘లాహే లాహే’ పాట అతిథులను ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్