Saturday, January 18, 2025
HomeTrending Newsపోలీసు నియామకాలకు సిఎం గ్రీన్ సిగ్నల్

పోలీసు నియామకాలకు సిఎం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి కానుక అందించారు. భారీ స్థాయిలో  పోలీసు నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 6,511 పోలీసు నియామకాల భర్తీకి అనుమతి మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. నిర్దిష్ట కాల పరిమితిలో ఈ నియామకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  • సివిల్‌ విభాగంలో ఎస్సై పోస్టులు-315
  • రిజర్వ్‌ విభాగంలో ఎస్సై పోస్టులు-96
  • సివిల్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు-3580
  • ఏపీ స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు-2520
  • మొత్తం=6,511

ఉద్యోగ నియామాకాలకోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది యువతకు ఈ నోటిఫికేషన్ ఊరట ఇవ్వనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్