Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Dr. BR Ambedkar: అపర జ్ఞానశీలి: సిఎం జగన్ నివాళి

Dr. BR Ambedkar: అపర జ్ఞానశీలి: సిఎం జగన్ నివాళి

భారత రాజ్యంగ నిర్మాత, మేధావి డా. బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ 137వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనీల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌ రావు హాజరయ్యారు.

“దేశం గర్వించదగ్గ మేథావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆథ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత.

భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారితలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళులు” అంటూ సామాజిక మాధ్యమాల్లో  పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్