Saturday, June 13, 2026
HomeTrending Newsఅభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం

అభివృద్ధి లక్ష్యాల రిపోర్టింగ్ కూడా ముఖ్యం: సిఎం

Review: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు గతంలో ఎప్పుడూ ఇంత ప్రయత్నం జరగలేదని,  ఇంత బాగా చేస్తున్నా సమర్థవంతమైన రిపోర్టింగ్‌ లేకపోతే  లాభం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలపై క్యాంప్‌ కార్యాలయంలో  సిఎం జగన్ సమీక్ష జరిపారు.   వైద్య, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ మనం చేస్తున్న కృషి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు.

సమీక్షలో సిఎం చేసిన వ్యాఖ్యలు:

  • క్యాలెండర్‌ ప్రకారం మిస్‌ కాకుండా.. ఏ పథకం ఎప్పుడు వస్తుందనేది ముందుగానే క్యాలెండర్‌ ప్రకటిస్తున్నాం
  • డీబీటీ ద్వారా బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే డబ్బులు పోతున్నాయి
  • అవినీతి, వివక్షకు తావు లేకుండా శాచురేషన్‌ మోడ్‌లో ఈ పథకాలు… అందిస్తున్నాం
  • జిల్లాల్లో కలెక్టర్లు ఎస్‌డీజీ రిపోర్టును మానిటరింగ్‌ చేసే బాధ్యత తీసుకోవాలి
  • విభాగాధిపతుల పర్యవేక్షణ అవసరం, ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ
  • ప్రతి నెలా ఎస్‌డీజీ రిపోర్టును కలెక్టర్‌ పర్యవేక్షణ చేయాలి
  • సచివాలయం నుంచి డేటా జిల్లా స్ధాయికి చేరాలి
  • ప్రతిరంగంలోనూ ప్రస్ఫుటమైన మార్క్‌ వేయగల పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి
  • అమ్మఒడి, టీఎంఎప్, ఎస్‌ఎంఎఫ్‌లను సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదు
  • సంపూర్ణపోషణ, గోరుముద్ద కూడా సక్రమంగా రిపోర్టింగ్‌ చేయలేదు
  • విద్యాకానుక, విద్యా దీవెన, పుల్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.20వేలు వసతి దీవెన గతంలో ఎప్పుడూ జరగలేదు
  • ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీలో దాదాపు 3వేల చికిత్సా విధానాలు, 16 కొత్తమెడికల్‌ కాలేజీల నిర్మాణం, నాడు–నేడుతో మొత్తం ఆసుపత్రుల పునర్‌వ్యవస్ధీకరణ, ఆరోగ్యఆసరా ఇవేవీ గతంలో లేవు
  • మహిళా సాధికారతలో చేయూత, ఆసరా, అమ్మఒడి, సున్నావడ్డీ, మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ గతంలో ఎప్పుడూ జరగలేదు
  • ఒక్క బటన్‌ నొక్కి ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 1 లక్షా 65 వేల కోట్లు డీబీటీ ద్వారా జమ చేసింది
  • దేశంలో ఈ తరహా డీబీటీ విధానం లేదు
  • ఈ పథకాలన్నీ కచ్చితంగా మన రిపోర్టింగ్ లో ప్రతిబింబించాలి
  • ఎస్‌డీజీకి సంబధించిన కచ్చితంగా ఎస్‌ఓపీలు ఉండాలి
  • కచ్చితంగా ఎస్‌డీజీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అప్‌ డేట్‌ చేయాలి
  • విద్యాశాఖలో నూటికి నూరుశాతం ఎస్‌డీజీ లక్ష్యాలను సాధించాలి
  • ప్రతినెలా సీఎస్‌ ఆధ్వర్యంలోనెలకు రెండుదఫాలుగా సమావేశం కావాలి, మూడు నెలలపాటు ఇలా సమావేశమవ్వాలి
  • ఎస్‌డీజీ మీటింగ్‌లో సెక్రటరీలు పాల్గొనాలి, కలెక్టర్లతోనూ మాట్లడాలి
  • దాదాపు 7నుంచి 8 రంగాలలో వైద్యఆరోగ్యరంగం, విద్య, మహిళాసాధికారత, గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్, సోషల్‌ జస్టిస్, మున్సిపల్‌శాఖ, పట్టణాభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం
  • విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీహబ్‌ను నిర్మించేందుకు  కార్యారణ రూపొందించాలి

సమీక్షా సమావేశంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

Also Read : ఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular