Sunday, January 19, 2025
HomeTrending Newsక్యాన్సర్‌ వ్యాధిపై  ప్రత్యేక దృష్టి: సిఎం ఆదేశం

క్యాన్సర్‌ వ్యాధిపై  ప్రత్యేక దృష్టి: సిఎం ఆదేశం

Cancer treatment: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ పరీక్షలు, నిర్ధారణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. – 2020లో రాష్ట్రంలో 34వేల మంది క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందారని, ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మరణాలు సంభావిస్తున్నాయని అధికారులు సిఎంకు తెలిపారు. చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టిపెట్టాలని సూచించారు. దీనికోసం డిసెంబర్‌ కల్లా విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇవి పూర్తయితే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుందని, క్యాన్సర్‌ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్‌ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్‌ కాలేజీలతో కలిపి 27 మెడికల్‌కాలేజీల్లో కూడా క్యాన్సర్‌ నివారణకు రెండేసి చొప్పున లైనాక్‌ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్‌ తయారు చేసుకోవాలన్నారు.

సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా తల్లికి ఆరోగ్య ఆసరా కింద రూ.5వేల రూపాయలు ఇవ్వాలని సిఎం ఆదేశించారు.  సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య శ్రీ, 104,108 సేవలు, ఆరోగ్య ఆసరా, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై అధికారులు సిఎంకు వివరాలు అందించారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సెక్రటరీ జి ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : ఏసీబీ మొబైల్ యాప్ ప్రారంభించిన సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్