Sunday, January 19, 2025
HomeTrending Newsవిదేశీ పర్యటనకు సిఎం జగన్

విదేశీ పర్యటనకు సిఎం జగన్

Foreign Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా మే 20 నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. దావోస్​లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం సదస్సు అనంతరం వ్యక్తిగత పర్యటనలో ఉంటారు.

ఈనెల 20న కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. మే 22, 23, 24 తేదీల్లో దావోస్​లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సదస్సులో ఏపీ పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకూ జగన్ హాజరు కానున్నట్లు సీఎంవో వెల్లడించింది. అనంతరం మే 25 నుంచి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు. అయన మే 30న తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్