Saturday, November 23, 2024
HomeTrending Newsరైతు భరోసా: మూడో ఏడాది మూడో విడత

రైతు భరోసా: మూడో ఏడాది మూడో విడత

Bharosa to Farmers: వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతన్నలకు రూ. 1,036 కోట్ల సాయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు.

సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి కింద ఏటా 13,500 రూపాయల రైతు భరోసా సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం

నేడు అందిస్తున్న సాయం రూ. 1,036 కోట్లతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా సాయం ద్వారా రైతులకు అక్షరాలా 19,813 కోట్ల రూపాయల సాయం అందించింది.

జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో 2019 తో పోల్చితే 202021లో దాదాపు నూరు శాతం వృద్ది సాధించి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌ (జీజీఐ) ర్యాంకింగ్స్‌ లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది.

రైతు సంక్షేమమే ధ్యేయంగా పంటల సాగుకయ్యే పెట్టుబడి సాయం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా, విత్తనం నుండి పంట అమ్మకం వరకు రైతులకు గ్రామంలో తమ గడప వద్దనే సేవలందించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, కనీస మద్దతు ధరలకు పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం, వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం, రెండు లక్షల బోర్లు లక్ష్యంగా అర్హులైన ప్రతి రైతుకు ఉచితంగా బోరు, మోటర్‌ అందించేందుకు వైఎస్సార్‌ జలకళ వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా గత రెండున్నర ఏళ్ళలో శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 86,288 కోట్లు. 

Also Read : ఓర్వలేక పోతున్నారు: సిఎం జగన్ విమర్శ

RELATED ARTICLES

Most Popular

న్యూస్