Saturday, September 21, 2024
HomeTrending Newsచిన్నపరిశ్రమలకు ప్రభుత్వ ఊతం

చిన్నపరిశ్రమలకు ప్రభుత్వ ఊతం

ఎంఎస్‌ఎంఈలు, టెక్స్ టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు 1,124 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, సెప్టెంబర్ ౩న  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ ఆయా కంపెనీల అకౌంట్లలో జమ చేయనున్నారు. వీటిలో ఎంఎస్‌ఎంఈలకు 440 కోట్లు, టెక్స్ టైల్, స్పిన్నింగ్‌ మిల్లులలు 684 కోట్ల రూపాయలు అందించనున్నారు. రెండేళ్లలో ఈ రంగాలకు జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లు అవుతుంది.

  • రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులు
  • గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్‌ఎంఈలకు బకాయి పెట్టిన రూ. 904 కోట్లు, స్పిన్నింగ్‌ మిల్స్‌కు బకాయి పెట్టిన రూ. 684 కోట్లు మొత్తం రూ. 1,588 కోట్లు బకాయిలు సైతం జగన్‌ ప్రభుత్వం చెల్లింపు
  • రూ. 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్, నీరు, సీఈటీపీలు మరియు ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కుగా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం
  • ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ. 730.50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ద్వారా 30,000 మందికి ఉపాధి
  • జగన్‌ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలతో, రూ. 5,204.09 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 16,311 ఎంఎస్‌ఎంఈలు అదనంగా 1,13,777 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి
  • ప్రోత్సాహకాలతో లబ్దిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62 శాతం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులదే, ప్రోత్సాహకాలు పొందుతున్న యూనిట్లలో 42 శాతం అక్కచెల్లెమ్మలకు చెందినవి.
  • వైఎస్సార్‌ నవోదయం కింద 1,08,292 ఎంఎస్‌ఎంఈల బ్యాంకు ఖాతాలకు చెందిన సుమారు రూ. 3,236.52 కోట్ల రుణాల రీ షెడ్యూల్‌…2,49,591 ఎంఎస్‌ఎంఈల బ్యాంకు ఖాతాలకు అత్యవసర క్రెడిట్‌ లైన్‌ హమీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద రూ. 5,973 కోట్ల బ్యాంకు రుణాలతో అదనపు వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌
  • జగన్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ. 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా 46,119 మందికి ఉపాధి లబిస్తోంది. ఇదే కాకుండా రూ. 36,384 కోట్ల పెట్టబడితో త్వరలో ప్రారంభం కానున్న మరో 62 భారీ, మెగా ప్రాజెక్టుల ద్వారా 76,916 మందికి ఉపాధిని కల్పించనున్నాయి.
  • దేశంలో తొలిసారిగా పారిశ్రామిక వేత్తల ఫీడ్‌ బ్యాక్‌ని కూడా తీసుకుని జరిపిన సర్వే ఆధారంగా, వరల్డ్‌ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను ప్రకటించిన స్టేట్‌ బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ జాతీయ ర్యాంకులలో ఏపీ తొలిస్ధానంలో నిలిచింది. ఇన్వెస్టర్లు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి, విశ్వసనీయతకు ఇది నిదర్శనం
  • యూనిట్‌కు కేవలం రూ. 2.48 పైసల ఖర్చుతో 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టెండర్లను పిలవడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్