Saturday, January 18, 2025
HomeTrending Newsనేడు విశాఖలో వైఎస్సార్‌ వాహన మిత్ర

నేడు విశాఖలో వైఎస్సార్‌ వాహన మిత్ర

సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్నివరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 261.52 కోట్ల ఆర్ధిక సాయం అందిస్తున్నారు. స్వయం ఉపాధిని అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవరన్నలకు అండగా ఉండేందుకే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టారు.  నేడు అందిస్తున్న రూ. 261.52 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,026 కోట్లు.

2019 – 20 సంవత్సరంలో 2,36,343 మంది లబ్ధిదారులకు రూ. 236.34 కోట్లు, 2020 – 21 సంవత్సరంలో 2,73,476 మంది లబ్ధిదారులకు రూ. 273.47 కోట్లు, 2021 – 22 సంవత్సరంలో 2,54,646 మంది లబ్ధిదారులకు రూ. 254.64 కోట్లు, 2022 – 23 సంవత్సరంలో 2,61,520 మంది లబ్ధిదారులకు రూ. 261.52 కోట్లు…ఇలా మొత్తం కలిపి రూ. 1,025.97 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్