రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్ పత్రాలు అందించనున్నారు. దీని ద్వారా 35,600 ఎకరాల భూముల్లో 22 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం జగన్ ప్రసంగించనున్నారు.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. 10.55 – 12.25 గంటల మధ్య బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం, అనంతరం నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలు రైతులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.