Navaratnaalu: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లో జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ళ పట్టాల పంపిణీ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తోన్న 73 లేఔట్లలో ఒక లక్షా 23 వేల మంది లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరనుంది.
ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు. 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత పట్టాలు, హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని, ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నిన్ననే పరిశీలించి అధికారులకు తగిన ఏర్పాట్లు చేశారు.
Also Read : ఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్