Friday, April 4, 2025
HomeTrending News11న స్పైసెస్ పార్క్ ప్రారంభం

11న స్పైసెస్ పార్క్ ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 11న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.  యడ్లపాడు మండలం వంకాయలపాడు సమీపంలో ఐటిసి సంస్థ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల పార్కులో 6.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో నిర్మించిన మిర్చి ప్రాసెసింగ్ ప్లాంట్ ను సిఎం ప్రారంభించనున్నారు. అనంతరం మిర్చి రైతులతో సిఎం సమావేశం కానున్నారు.

దివంగత నేత వైఎస్సార్ దీనికి శంఖుస్థాపన చేశారు. ఈ ఐటీసీ ప్రాసెసింగ్ యూనిట్ వ‌ల్ల స్థానిక రైతుల పంట ఉత్పత్తుల‌కు గిరాకీ ఏర్పడుతుంది. ఏడాదికి 20వేల ట‌న్నుల పంట‌ను ప్రాసెస్ చేసే సామ‌ర్థ్యం ఈ యూనిట్‌ ద్వారా 2 వేల మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు తెలిపారు. ఏటా 20వేల ఎక‌రాల్లో పండిన పంట‌ను ఈ యూనిట్ ప్రాసెస్ చేసి ఎగుమ‌తులు చేయనుంది, 5500 రైతు కుటుంబాల‌కు దీనివ‌ల్ల ల‌బ్ధి చేకూరనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్