Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: నరసాపురంలో సిఎం టూర్

YS Jagan: నరసాపురంలో సిఎం టూర్

Fisheries Day: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం, నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు.  పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కొన్ని కొత్త పనులకు శంకుస్ధాపనలు కూడా చేయనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగే బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు. నర్సాపురం సమీపంలో కొత్తగా నిర్మిస్తోన్న ఆక్వా యూనివర్శిటీ పనులకు సిఎం శంఖుస్థాపన చేయనున్నారు.

సిఎం చేతుల మీదుగా జరగనున్న ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల వివరాలు:

  1. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం శంకుస్ధాపన
  2. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ శంకుస్ధాపన
  3. నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములు
  4. ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ శంకుస్ధాపన
  5. నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం
  6. ప్రజారోగ్యసాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం ప్రారంభోత్సవం
  7. నరసాపురం బస్‌స్టేషన్‌ పునరుద్ధరణ పనులకు శంకుస్ధాపన
  8. ఖజానా మరియు లెక్కల కార్యాలయం, నరసాపురం శంకుస్ధాపన
  9. 220/132/ 33 కె.వి రుస్తుంబాద విద్యుత్‌ ఉపకేంద్రం శంకుస్ధాపన
  10. జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుల శంకుస్ధాపన
  11. నరసాపురం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి స్కీము
  12. వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం చేయుట
  13. శేషావతారం పంట కాలువ అభివృద్ది పనులు
  14. మొగల్తూరు వియర్‌ పంట కాలువ నిర్మాణ పనులు
  15. కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు మరియు ముస్కేపాలెం అవుట్‌ఫాల్‌ నిర్మాణపు శంకుస్ధాపన

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకోనున్న సీఎం. 11.15 – 12.50 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్