CM to meet: ఉద్యోగ సంఘాల నేతలు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట వరకూ పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు కొంత సానుకూల వాతావరణంలో జరిగాయి.
పెన్షనర్ మరణిస్తే మట్టి ఖర్చులకు 25వేల రూపాయలు ఇచ్చేందుకు హామీ ఇచ్చిన మంత్రుల కమిటీ, ఐఆర్ ను వేతనాల నుంచి రికవరీ చేయబోమని వెల్లడించింది. సిసిఏ పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇస్తామని కూడా భరోసా ఇచ్చింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ను బైటపెట్టే అంశంపై స్పష్టత రాలేదు. ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్లపై మంత్రుల కమిటీ నేడు ఆర్ధిక శాఖా అధికారులతో సమావేశమై ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయమై చర్చించనుంది. ఆ తర్వాత నేటి మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత సిఎంతో భేటీ ఉండే అవకాశం ఉందని తెలిసింది.
అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందున తమ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని స్టీరింగ్ కమిటీ నేతలు స్పష్టం చేశారు.
Also Read : చర్చలు ప్రభుత్వ బాధ్యత: అశోక్ బాబు